వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. సమ్మర్ హీట్ వల్ల తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్, వేడి వల్ల అలసట, కాలుష్య కారకాలు, అనేక ఇతర అంశాలు హీట్ హెడేక్ కు దోహదం చేస్తాయి.   

pexels

By Bandaru Satyaprasad
May 04, 2024

Hindustan Times
Telugu

అధిక ఉష్ణోగ్రత లేదా వేడి వాతావరణంలో మీకు తరచూ తలనొప్పి వస్తుంటే దానిని హీట్ హెడేక్ అని భావించవచ్చు. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నియంత్రణ సమస్యల కారణంగా తలనొప్పి వస్తుంది.  

pexels

వేడి వాతావరణం, ఎక్కువసేపు ఎండలో ఉండడం, వేడి వాతావరణంలో తీవ్రమైన శారీరక శ్రమ, హాట్ టబ్‌లలో ఎక్కువ సేపు గడపడం వంటి వివిధ కారణాల వల్ల హీట్ తలనొప్పి వస్తుంది.  

pexels

డీహైడ్రేషన్ కూడా హీట్ హెడేక్ మరొక కారణం. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి మీ శరీరానికి వేడి ఉష్ణోగ్రతలలో ఎక్కువ నీరు అవసరం. డీహైడ్రేషన్ సెరోటోనిన్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఇది తలనొప్పిని తీవ్రతరం చేస్తుంది.  

pexels

 హీట్ ఎగ్జాషన్ తలనొప్పి లక్షణాలలో ఒకటిగా చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఇది సంభవించే అవకాశం ఉంది. వేడి వాతావరణంలో బయట ఉన్న తర్వాత మీకు తలనొప్పి ఉంటే వేడి అలసట లేదా హీట్ స్ట్రోక్ పరిస్థితి ఏర్పాడుతుంది.  

pexels

వేడి తలనొప్పికి లక్షణాలు- వికారం, తల తిరగడం, కండరాల తిమ్మిరి, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన దాహం, చర్మం చల్లబడడం, వేగవంతమైన లేదా బలహీనమైన పల్స్ రేటు

pexels

వేడి తలనొప్పి నివారణ - అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బయటకు వెళ్లవద్దు. తీవ్రమైన వేడికి గురికాకుండా చల్లని ప్రాంతంలో ఉండాలి. వేడి తలనొప్పి లక్షణాలలో డీహైడ్రేషన్ ఒకటి. హైడ్రేటెడ్ గా ఉండటం ద్వారా దీనిని నివారించడానికి ప్రయత్నించాలి.   

pexels

టోపీలు, సన్ గ్లాసెస్ అలాగే వేడిని తక్కువ గ్రహించే, గాలి వేసే దుస్తులు ధరించాలి. ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేసే పానీయాలు తాగాలి.  అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు, సమతుల్య ఆహారం తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఐస్ ప్యాక్ ఉపయోగించండి. 

pexels