జుట్టు రాలుతోందా? ఇంట్లోనే వీటిని ట్రై చేయండి!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 19, 2023

Hindustan Times
Telugu

జుట్టు రాలే సమయంలో కెమికల్స్ ఉన్న ప్రొడక్టులను విపరీతంగా వాడితే సమస్య మరింత ఎక్కువ కావొచ్చు. వెంట్రుకలు రాలడం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది.

Photo: Pexels

వెంట్రుకలు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఇంట్లోనే సొంతంగా కొన్ని నివారణ మార్గాలను ప్రయత్నించవచ్చు. అవేంటంటే..

Photo: Pexels

తాజా కలబంద (అలోవెర)ను జెల్‍గా చేసి.. స్కాల్ప్ (తల మీది చర్మం/కుదుళ్లు)పై మసాజ్ చేయాలి. 30 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత కడిగేయాలి.

Photo: Pexels

వేప ఆకులను ముద్దగా చేసి.. కాస్త ఉడికించి ఆ పేస్టును షాంపో చేసుకున్నాక స్పాల్ప్‌కు రాయాలి. అనంతరం 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

Photo: Pexels

వెంట్రుకల కుదుళ్లను కొబ్బరినీళ్లను మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Photo: Pexels

ఒక ఉల్లిపాయను గ్రైండ్ చేసి దాని నుంచి జ్యూస్ తీసి కాటన్ బాల్ సాయంతో స్కాల్ప్‌కు పట్టించాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

Photo: Pexels

టీ స్పూన్ ఉసిరి పొడిలో 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం కలిపి పేస్టుగా తయారు చేసుకోవాలి. దాన్ని స్పాల్ప్‌కు పట్టించి 40 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.

Photo: Pexels

గుడ్డు నుంచి ఎగ్‍వైట్‍‍ను సపరేట్ చేసుకొని దాంట్లో స్పూన్ యుగర్ట్‌ను కలపాలి. తలను శుభ్రం చేసుకునే 30 నిమిషాల ముందు దీన్ని స్పాల్ప్‌కు పూసుకోవాలి.

Photo: Pexels

శరీరంలో ఐరన్‍ను పెంచే 5 రకాల జ్యూస్‍లు ఇవి

Photo: Pixabay