కళ్లలో దురద, ఎరుపు, మంట వంటి సమస్యలు రోజువారీ కార్యకలాపాలకు చాలా ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఇంట్లోనే చిట్కాలు ఉన్నాయి. 

Unsplash

By Anand Sai
Oct 23, 2023

Hindustan Times
Telugu

ఫోన్, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. కళ్లలో దురద, ఎరుపు, మంట వంటి సమస్యలు వస్తున్నాయి. 

Unsplash

దోసకాయ ముక్కలు కళ్ల చికాకుకు గొప్ప ఔషధం. దోసకాయలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి వాపు, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. 

Unsplash

కళ్ల మంట నుండి ఉపశమనం పొందడానికి దోసకాయను ముక్కలుగా కట్ చేసి మీ కళ్ళపై ఉంచండి. కాసేపు అలానే ఉంచుకోవాలి.

Unsplash

గ్రీన్ టీ బ్యాగులు కళ్లకు బాగా పనిచేస్తాయి. టీ బ్యాగ్‌ని వేడి నీటిలో ముంచి కాసేపు చల్లారనివ్వాలి. అప్పుడు మీ కనురెప్పల మీద టీ బ్యాగ్ ఉంచండి. టీలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించి, కళ్లకు ఉపశమనం కలిగిస్తాయి.

Unsplash

కంటి సమస్యలకు రోజ్ వాటర్ నేచురల్ రెమెడీ. రోజ్ వాటర్‌లో కాటన్ బాల్ లేదా ప్యాడ్‌ను నానబెట్టి, మీ మూసిన కనురెప్పలపై ఉంచండి. ఇది చికాకును తొలగించడానికి, మీ కళ్ళను రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది.

Unsplash

కలబందను సాధారణంగా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తారు. ఇది కళ్ల దురదలకు కూడా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 

Unsplash

అలోవెరా జెల్‌ని చల్లటి నీటితో మిక్స్ చేసి, కాటన్ బాల్ సహాయంతో మీ కనురెప్పలపై అప్లై చేయండి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది.

Unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash