పంటి నొప్పి ఎక్కువ మందిని వేధించే సమస్య. పళ్లు పుచ్చిపోవడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వాపు, జ్ఞాన దంతాలు వచ్చినప్పుడు...నొప్పి తీవ్రంగా ఉంటుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.  

pexels

By Bandaru Satyaprasad
Aug 11, 2024

Hindustan Times
Telugu

ఉప్పు నీళ్లు - వేడి నీటిలో కాస్త ఉప్పు వేసి పుక్కిలించాలి. ఇది సహజమైన యాంటి సెప్టిక్‌లా పనిచేస్తుంది. 30 సెకన్ల పాటు ఉప్పు నీటిని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల పంటి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. రోజులో వీలైనన్ని సార్లు పుక్కిలించడం చేస్తే సూక్ష్మ క్రిములు తగ్గుతాయి.  

pexels

లవంగాలు- లవంగాలతో పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. లవంగాల్లోని యుగేనల్ అనే రసాయనం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. నొప్పి వచ్చే దంతంపై  లవంగాన్ని ఉంచి నమిలితే అందులోని నూనె పంటి నొప్పిని తగ్గిస్తుంది.   

pexels

వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటి బయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి తీవ్రమైన పంటి నొప్పి నుంచి రిలీఫ్ అందిస్తాయి. వెల్లుల్లిని మెత్తగా చేసి సాల్ట్ లేదా మిరియాలతో కలిపి నొప్పి వస్తున్న పంటిపై ఉంచాలి. వెల్లుల్లిని నేరుగా నమిలినా నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.  

pexels

ఐస్ క్యూబ్‌- ఐస్ క్యూబ్ లను పలుచటి గుడ్డతో చుట్టి నొప్పి వస్తున్న పంటిపై ఉంచితే రిలీఫ్ ఉంటుంది. చిగుళ్ల వాపు, నొప్పి తగ్గడానికి ఈ ట్రిక్ సహాయపడుతుంది.  

pexels

కొబ్బరి నూనె- కొబ్బరి నూనెను డెంటల్ కావిటీస్ వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. ఒక చెంచా కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు పుక్కిలించాలి.  ఆ తర్వాత ఉమ్మేయండి. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.  

pexels

నువ్వులు- నువ్వులు దంతాల సమస్యలతో బాధపడేవారికి చక్కటి పరిష్కారం. నువ్వులతో చేసిన మిశ్రమాన్ని  పిప్పి పన్ను ఉన్నచోట అప్లై చేయాలి. రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.  

pexels

లైకోరైస్- లైకోరైస్ రూట్ పంటి సమస్యకు అద్భతమైన పరిష్కారం. లైకోరైస్ పొడిని బ్రష్‌కు అప్లై చేసి దంతాలను శుభ్రం చేయండి. ఆపై నీటితో క్లీన్ చేసుకోండి. 

pexels

వేప పుల్ల- దంతాలను శుభ్రం చేయడానికి వేప పుల్లను ఉపయోగించవచ్చు. తరచుగా వేప పుల్లతో బ్రష్ చేస్తే పంటి సమస్యలు తగ్గుతాయి.  

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash