వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దోమ కాటుతో దురద, వాపు కొన్నిసార్లు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దోమ కాటు నుంచి ఉపశమనం కోసం చామంతి పువ్వులను ఉపయోగించవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Sep 02, 2024
Hindustan Times Telugu
చామంతిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దోమ కాటుకు సమర్థవంతమైన ఇంటి నివారిణిగా పనిచేస్తాయి. దోమకాటు నుంచి తక్షణ ఉపశమనం కోసం చామంతిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
pexels
చామంతి పువ్వులను నీటిలో 5-7 నిమిషాలు ఉడకబెట్టి, నీటిని చల్లార్చండి. అందులో మెత్తని గుడ్డను నానబెట్టి దోమ కుట్టిన చోట పెడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
pexels
చామంతి పువ్వులను నీటిలో ఉడకబెట్టి చల్లారనివ్వాలి. తర్వాత ఐస్ ట్రేలో ఈ నీటిని పోసి ఫ్రిజ్‌లో ఉంచితే ఐస్ క్యూబ్స్‌గా తయారవుతాయి. ఈ ఐస్ క్యూబ్‌లను దోమ కాటు వద్ద ఉంచి వాపు తగ్గుతుంది.
pexels
కొబ్బరి నూనె లేదా జోజోబా ఆయిల్ తో కొన్ని చుక్కల చామంతి ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. దీన్ని దోమ కుట్టిన చోట రాయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేస్తే దురద, మంట తగ్గుతుంది.
చామంతి పువ్వులను మెత్తగా చేసిన వోట్ మీల్ లేదా బియ్యపు పిండితో కలిపి పేస్ట్ లా చేయండి. దీనిని దోమ కుట్టిన చోట రాయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడగాలి. ఇలా దోమ కాటు నుంచి ఉపశమనం ఉంటుంది.
pexels
వెచ్చని నీటిలో కొన్ని చుక్కల చామంతి ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. కాటన్ బాల్ లేదా మెత్తని క్లాత్ తో చర్మంపై అప్లై చేయండి. ఇది దోమ కాటు దురద, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
pexels
ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకుని చామంతి ఆయిల్ కలపండి. దోమ కుట్టిన చోట దీన్ని రాయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి కడగండి. దోమ కాటు వల్ల ఏర్పడిన వాపు, ఎరుపును ఇది నయం చేస్తుంది.
pexels
కొబ్బరి లేదా ఆలివ్ లేదా జోజోబా ఆయిల్ లో ఎండిన చామంతి పువ్వులను వేసి కొన్ని వారాల పాటు ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లోనే చామంతి నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ నూనెను దురద, వాపు ఉన్న చోట రాస్తే ఉపశమనం ఉంటుంది.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి