పాత్రలను సరిగ్గా క్లీన్ చేయడం తెలియకపోతే అందులోని క్రిములు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. సరిగ్గా క్లీన్ చేయకపోతే వంట పాత్రలపై నూనె మరకలు, జిడ్డు, ఆహార గుర్తులు అలానే ఉండిపోతాయి. అందుకే వీటిని ఎఫెక్టివ్ గా క్లీన్ చేసే పద్దతులు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
May 05, 2024

Hindustan Times
Telugu

హాట్ సోప్ వాటర్- వేడి నీటిలో సింక్ లేదా బేసిన్ నింపి కొంత డిష్ సోప్ వేయండి. వంట పాత్రలను ఆ సబ్బు నీటిలో కాసేపు నానబెట్టండి. పాత్రలను తోమడానికి స్పాంజ్ లేదా స్క్రబ్ వాడండి. ఆపై శుభ్రమైన నీటితో కడగండి.  

pexels

డిష్వాషర్ - మీకు డిష్వాషర్ ఉంటే వంట పాత్రలను అందులో లోడ్ చేయండి. లోడ్ చేయడానికి ముందు ఆహార వ్యర్థాలు తొలగించాలి. తగిన డిటర్జెంట్ తో డిష్వాషర్ ను ఉపయోగించాలి.  

pexels

వెనిగర్ - మొండి మరకలు, వంట పాత్రల సువాసన కోసం వెనిగర్ ఉపయోగించండి. తగిన నీటిలో వెనిగర్ వేసి అందులో పాత్రలను 15-30 నిమిషాలు నానబెట్టండి. ఆపై వాటిని స్పాంజ్ లేదా స్క్రబ్ తో క్లీన్ చేయండి. వెనిగర్ జిడ్డును సులభంగా తొలగిస్తుంది.  

pexels

మరిగే నీరు - ఓ పాత్రలో నీటిని బాగా మరిగించి అందులో పాత్రలను వేసి కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి. ఆపై ఆ పాత్రలను సబ్బు క్లీన్ చేసి, శుభ్రమైన నీటితో కడగండి.  

pexels

బేకింగ్ సోడా పేస్ట్ - బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ లా చేయండి. ఆ పేస్ట్ ను వంట పాత్రలకు అప్లై చేసి కాసేపు అలా ఉంచండి. మొండి మరకలు, జిడ్డు పోగెట్టేందుకు ఇది చక్కటి కిటుకు.  

pexels

స్టీమ్ క్లీనింగ్ - మీకు స్టీమ్ క్లీనర్ ఉంటే, పాత్రలను క్లీన్ చేసేందుకు దాన్ని ఉపయోగించండి. అధిక ఉష్ణోగ్రత గల ఆవిరి నూనె, జిడ్డు మరకలను తొలగిస్తుంది. స్టీమ్ క్లీనింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

pexels

అల్యూమినియం ఫాయిల్, బేకింగ్ సోడా- సింక్ ని వేడి నీటితో నింపండి. అల్యూమినియం ఫాయిల్ తో లైన్ అప్ చేయండి. అందులో బేకింగ్ సోడా వేయండి. ఈ నీటిలో పాత్రలను వేసి 15-30 నిమిషాలు నానబెట్టండి. ఆపై క్లీన్ చేయండి.   

pexels

తెలుగు టీవీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నాడు నిరుప‌మ్ ప‌రిటాల‌.