రంగుల పండుగ హోలీ వచ్చేసింది. కుటుంబ సభ్యులు, మిత్రులతో ఎంతో ఉల్లాసంగా హోలీ సంబరాలు జరుపుకుని, చక్కని పిండి వంటలు రుచిచూస్తుంటారు.  

pexels

By Bandaru Satyaprasad
Mar 23, 2024

Hindustan Times
Telugu

హోలీ పండుగ రోజున కొన్ని సంప్రదాయ వంటలు చేస్తుంటారు. వివిధ రకాల రుచికరమైన వంటకాలు, స్నాక్స్, పానీయాలు ఇందులో భాగంగా ఉంటాయి.  

pexels

ఈ రుచికరమైన పిండి వంటలను కడుపు నిండా తిని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకుంటారు. హోలీ పండుగ నాడు చేసుకుని ఐదు రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుంది.   

pexels

కజ్జికాయలు-గుజియా లేదా కజ్జికాయలు హోలీ పండుగకు చేసుకునే ప్రియమైన తీపి వంటకం. దీనిని కోవా,డ్రై ఫూట్స్ర్, గింజల మిశ్రమంతో తయారు చేస్తారు. మైదా, నెయ్యితో తయారు చేసిన పదార్థాన్ని వేయించి దానిలో ఈ మిశ్రయాన్ని పెట్టి తయారుచేస్తారు.  

Twitter

జిలేబి- జిలేబి ప్రసిద్ధమైన భారతీయ స్వీట్, ముఖ్యంగా హోలీ సమయంలో ఇంట్లో చేసుకుంటారు. బెల్లం లేదా పంచదార పాకంతో తయారుచేస్తారు. పిండిని వేయించి వేయించి, దానిని చక్కెర పాకంలో నానబెట్టాలి. కొందరు దీనిని హోలీ రోజున అల్పాహారంగా ఆస్వాదిస్తారు.   

twitter

మాల్పువా- మాల్పువా అనేది భారతీయ సంప్రదాయ వంటకం. ముఖ్యంగా భోజనం తర్వాత ఆస్వాదిస్తారు. ఇది మైదా, సెమోలినా, అరటిపండ్లు గుజ్జు, పాలు, కొన్నిసార్లు పెరుగు లేదా కొబ్బరితో తయారు చేసిన తీపి వంటకం. ఈ పదార్థాన్ని తయారుచేసిన తర్వాత చక్కెర పాకంలో ముంచితే రుచి మరింత పెరుగుతుంది.   

twitter

తాండై- తాండై అనేది హోలీ వేడుకలలో చేసుకునే క్లాసిక్ పానీయం. పాలు, పంచదార, గింజలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారు చేసిన తాండై డ్రింక్ లో ప్రత్యేకమైన రుచికి బాదం, పిస్తా, యాలకులు, కుంకుమపువ్వు, మిరియాలు, గసగసాల వంటి పదార్థాలు వేస్తారు. దీనిని కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకుని తాగితే రుచి ఆమోఘంగా ఉంటుంది.   

twitter

వడలు లేక పకోడీలు- ఇవి ఒక సాధారణ చిరుతిండి. వేయించిన వడలు, పకోడీలను శనగపిండి లేదా సాధారణ పిండితో తయారుచేస్తారు. ఈ పిండిలో ఉల్లి, మిర్చి, తగిన ఉప్పు కలిపి తయారు చేస్తారు. 

twitter

వేసవిలో దాహార్తిని తీర్చే నన్నారి షర్బత్ గురించి తెలుసా..?

image credit to unsplash