టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
image credit to unsplash
టమాటాలు తినడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. టమోటాలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
image credit to unsplash
లుటిన్, లైకోపీన్ వంటి ముఖ్యమైన కెరోటినాయిడ్లు టమాటాల్లో ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతాయి.
image credit to unsplash
టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
టమాటాలు తింటే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి.
image credit to unsplash
టమాటాలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధి క్రిములతో పోరాడటమే కాకుండా మన చర్మానికి మెరుపునిస్తుంది. ఇది శరీర కండరాలు ,గుండెకు కూడా మేలు చేస్తుంది.
image credit to unsplash
టమాటాను చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మం ద్వారా ఉత్పత్తి అయ్యే అదనపు నూనెను నియంత్రిస్తుంది. మొటిమలను కూడా తగ్గిస్తుంది.
image credit to unsplash
బిగ్ బాస్ తెలుగు 8 ఎంట్రీపై గుప్పెడంత మనసు జగతి క్లారిటీ