యానల్ ప్రాంతంలో విపరీతమైన నొప్పి, మలంలో రక్తం, తీవ్రమైన దురద ఉంటే మీకు హెమోరాయిడ్స్ ఉండవచ్చు. దీనిని పైల్స్ అని కూడా పిలుస్తారు. ఫైల్స్ ను అదుపులో ఉంచే 5 సూపర్ ఫుడ్స్ తెలుసకుందాం.
twitter
By Bandaru Satyaprasad Jun 08, 2024
Hindustan Times Telugu
హేమోరాయిడ్లను గుర్తించడం ఎలా - తీవ్రమైన మలబద్ధకం, పేగు కదలిక నొప్పి, మలంలో రక్తం, మల ప్రాంతంలో విపరీతమైన దురద, మలద్వారం చుట్టూ ఎరుపు, పుండ్లు పడడం, మలద్వారం వద్ద గడ్డలు
HT Telugu
అవిసె గింజలు- అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలాన్ని మృదువుగా చేసేందుకు, హేమోరాయిడ్స్‌లో పేగు కదలికకు సహాయపడతాయి. ప్రతి రోజు 1 టేబుల్ స్పూన్ పొడి అవిసె గింజలను తీసుకోవచ్చు. అవిసె గింజలను తీసుకునేటప్పుడు తగినంత నీరు తాగటం ముఖ్యం.
unsplash
త్రిఫల చూర్ణం - త్రిఫల చూర్ణం పేగుల్లో మలం కదలికలను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది. ఈ చూర్ణం హేమోరాయిడ్లలో నొప్పిని తగ్గిస్తుంది.
unsplash
కలబంద - కలబందలోని గ్లైకోప్రొటీన్లు, పాలీశాకరైడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తాయి. ఇది హేమోరాయిడ్లను నయం చేయడానికి గొప్ప మార్గం. కలబంద రసాన్ని తీసుకోవచ్చు. హేమోరాయిడ్ల వాపు, ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
unsplash
నెయ్యి - మన ఆహారంలో మంచి కొవ్వు పదార్థాలను చేర్చుకోవడంతో మూలవ్యాధిని నయం చేసుకోవచ్చు. నెయ్యి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. ఇది జీర్ణవ్యవస్థను లూబ్రికేట్ చేస్తుంది. మలం విసర్జించడాన్ని సులభతరం చేస్తుంది.
unsplash
ప్రూనే- నానబెట్టిన ప్రూనే లేదా ప్రూనే రసం తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని సార్బిటాల్ కంటెంట్ మూలవ్యాధికి మందుగా పనిచేస్తుంది. పేగు ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ కూడా అందిస్తుంది.