హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. మీ గుండెకు హాని కలిగించే 10 ఆహారాల గురించి తెలుసుకుని వాటిని నివారించుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Oct 02, 2024
Hindustan Times Telugu
వేయించిన ఆహారాలు - ఫ్రై చేసిన ఆహారాలు రుచికి బాగుంటాయి కానీ వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్ లు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. గుండెలోని రక్త నాళాలు మూసుకుపోవడానికి దారితీస్తాయి.
pexels
ఉప్పు - అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదానికి దారితీస్తుంది. ఉప్పు తక్కువగా వాడకం గుండె ఆరోగ్యానికి కీలకం.
pexels
కూల్ డ్రింక్స్- సోడాలు, ఎనర్జీ డ్రింక్స్..అనవసరంగా బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
pexels
ప్యాక్ చేసిన స్నాక్స్ - చిప్స్, ప్యాక్ట్ స్నాక్స్ లో అనారోగ్యమైన కొవ్వులు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, అధిక రక్తపోటు, గుండె సమస్యలకు దారితీస్తాయి.
pexels
ప్రాసెస్ చేసిన మాంసాలు - సాసేజ్ లు, బేకన్, హాట్ డాగ్ ల రుచికి బాగుంటాయి. అయితే వీటిలో అధిక స్థాయిలో సోడియం, ప్రిజర్వేటివ్ లు ఉంటాయి. ఇవి రక్తపోటుకు కారణమవుతాయి. గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
pexels
స్వీట్స్ - స్వీట్స్ లోని అధిక చక్కెర రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
pexels
వైట్ బ్రేడ్ -వైట్ బ్రేడ్ లో ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరుగు పెరిగి గుండె అనారోగ్యానికి దారితీస్తుంది. బర్గర్లు, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్స్ గుండె సమస్యలకు దారితీయవచ్చు.
pexels
ఫుల్ ఫ్యాట్ డెయిరీ ప్రొడెక్ట్స్ - పాలు, చీజ్, పెరుగు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కాలక్రమేణా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారాలే కానీ మితంగా తీసుకోవాలి.
pexels
మద్యం - అధిక ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది. బరువు పెరగడానికి దారితీస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి