బ్లడ్ ప్రెజర్ (బీపీ) తగ్గేందుకు సహకరించే 5 రకాల డ్రింక్స్ ఇవి
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Sep 18, 2023
Hindustan Times Telugu
అధిక రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) తీవ్రమైన ఆరోగ్య సమస్య. గుండె, కిడ్నీ వ్యాధులకు హైబీపీ దారి తీస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు సహకరించే ఐదు ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo Credit: Unsplash
కొబ్బరినీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక సోడియం స్థాయిలను కిడ్నీల నుంచి బయటికి పంపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీంతో శరీరంలో బ్లజ్ ప్రెజర్ లెవెల్స్ తగ్గుతాయి.
Photo Credit: Unsplash
బీట్‍రూట్‍లో డడైటరీ నైట్రేట్ ఉంది. అందుకే బీట్‍రూట్ జ్యూస్ తాగితే రక్తనాళాలు కాస్త విస్తరించేందుకు సహకరిస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.
Photo Credit: Unsplash
టమాటా జ్యూస్‍లో లికోపిన్ లాంటి యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది డియాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించగలదు.
Photo Credit: Unsplash
శరీరంలో యాంజియోటెన్‍సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ నియంత్రణలో ఉండేందుకు దానిమ్మ జ్యూస్ ఉపయోగపడుతుంది. అందుకే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు ఈ జ్యూస్ సహకరిస్తుంది.
Photo Credit: Unsplash
రోజుకు 2 కప్పుల వరకు కాఫీ తాగడం కూడా బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
Photo Credit: Unsplash
ఒకవేళ బ్లడ్ ప్రెజర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Photo Credit: Unsplash
సాధారణంగా మన ఇండ్లలో కాస్త ఎక్కువ అన్నం వండుతుంటారు. మిగిలిపోయిన అన్నంను ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని, మరుసటి రోజు తింటుంటాం. మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యకరమా? కాదా? తెలుసుకుందాం.