జిమ్‌కి వెళ్లి హెవీవెయిట్ పరికరాలను ఉపయోగించడం కంటే ఫిట్‌గా ఉండటానికి వాకింగ్, జాగింగ్ చాలా సాధారణ మార్గాలు. ఇవి బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు సహకరిస్తాయి.
pexels
By Bandaru Satyaprasad Jan 21, 2024
Hindustan Times Telugu
జాగింగ్ అంటే స్థిరమైన వేగంతో, సాధారణంగా గంటకు 6 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వ్యాయామం చేయడం. అంతకంటే వేగంగా వెళితే రన్నింగ్ గా పరిగణిస్తారు. వేగం దీని కంటే తక్కువగా ఉంటే, అది నడకగా భావిస్తారు. బరువు తగ్గడానికి నడక మంచిదా? జాగింగ్ మంచిదా? తెలుసుకుందాం.
pexels
జాగింగ్ అనేది కార్డియోవాస్కులర్ యాక్టివిటీకి ఒక రూపం, వ్యక్తి స్థిరమైన వేగంతో రన్నింగ్ చేయడం. కొన్ని అధ్యయనాల ప్రకారం జాగింగ్ తో హృదయ సంబంధ వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి.
pexels
జాగింగ్ వల్ల అదనపు కేలరీలను బర్న్ అవుతాయి. రోజంతా తక్కువ కేలరీలు తీసుకుంటే, అది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అధిక కొలెస్ట్రాల్, ఉబ్బసం ఉన్న వారికి జాగింగ్ మంచి వ్యాయామం.
pexels
జాగింగ్ శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తే శరీర కండరాలను బలోపేతం అవుతాయి
pexels
జాగింగ్ లేదా వాకింగ్ ద్వారా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. 10,000 స్టెప్స్ జాగింగ్ చేయడం ద్వారా దాదాపు 500 నుంచి 700 కేలరీలు బర్న్ అవుతాయి. నడక విషయానికొస్తే, ఇది జాగింగ్ కంటే చాలా తక్కువగా అంటే సగటున 350 నుంచి 500 కేలరీలు బర్న్ అవుతాయి.
pexels
మీ ఫిట్‌నెస్ స్థాయిలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో నడక లేదా జాగింగ్ ను ప్రారంభించండి. ఎత్తైన ప్రదేశాల్లో కాకుండా సాధారణ ఉపరితలంపై నడవడానికి ప్రయత్నించండి.
pexels
పాదాలకు అసౌకర్యం లేకుండా తగిన రన్నింగ్ షూలను ఉపయోగించండి. జాగింగ్ లేదా వాకింగ్ కు ముందు తగిన స్థాయిలో నీరు తాగండి. అయినప్పటికీ, మీకు దాహం వేస్తే మధ్యలో నీటిని సిప్ చేస్తూ ఉండవచ్చు.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి