ప్రతీ రోజు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే, రోజులో మరీ ఎక్కువగా కూడా పాలు తాగకూడదు. అతిగా పాలు తాగితే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
పాలు అతిగా తాగితే కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది. జీర్ణం సరిగా కాకపోవడం, కడుపు నొప్పిగా అనిపించడం, గ్యాస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి.
Photo: Pexels
పాలు మోతాదుకు మించి ఎక్కువగా సేవిస్తే బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని కొన్ని వైద్య అధ్యయనాల్లో తేలింది.
Photo: Pexels
అతిగా పాలు తాగితే చర్మంపై మొటిమలు, మచ్చలు వచ్చే రిస్క్ ఉంటుంది. పాలల్లో కాంప్లెక్స్ ఫ్యాట్ అధికంగా ఉండడమే ఇందుకు కారణం.
Photo: Pexels
ప్రతీ రోజు ఎక్కువ పాలు సేవించడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే పరిమితి మేరకే పాలు తాగాలి.
Photo: Pexels
అతిగా పాలు తాగితే కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూలంగా ఉంటుంది
Photo: Pexels
రోజులో మూడు కప్పుల వరకు పాలు తాగడం మంచిదని చాలా అధ్యయనాలు తేల్చాయి. అంతకంటే ఎక్కువగా సేవిస్తే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి.