నగ్నంగా నిద్రిపోవడం అసాధారణంగా అనిపించవచ్చు. ఇలా నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు 

pexels

By Bandaru Satyaprasad
Apr 24, 2024

Hindustan Times
Telugu

నిద్ర నాణ్యత- నగ్నంగా నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. నిద్రలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. నగ్నంగా నిద్రపోతే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ప్రశాంతమైన నిద్ర, వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 

pexels

చర్మం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది- తగినంత నిద్ర ఉంటే శరీరం చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. నిద్రలో మీ శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని దృఢంగా చేస్తుంది. మొటిమలు, చర్మసంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

pexels

ఒత్తిడిని తగ్గిస్తుంది- నగ్నంగా నిద్రించడం వల్ల ఒత్తిడి స్థాయిలను తగ్గేందుకు సాయపడుతుంది. బేర్ స్కిన్‌ కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ప్రశాంతత భావాన్ని ప్రోత్సహిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.  

pexels

బరువు నిర్వహణకు- 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర బరువు తగ్గడాన్ని మెరుగుపరుస్తుంది. నగ్నంగా నిద్ర మెరుగైన నిద్రకు సాయపడుతుంది.  

pexels

వ్యాధులను దూరం చేస్తుంది- నగ్నంగా నిద్రించడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. నగ్నంగా నిద్రపోతే తల నుంచి కాలి వరకు శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మెరుగైన రక్త ప్రసరణ రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో సాయపడుతుంది. 

pexels

సాన్నిహిత్యాన్ని పెంచుతుంది- నగ్నంగా నిద్రపోవడం వల్ల మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఆక్సిటోసిన్‌ విడుదలై  సాన్నిహిత్య భావాలను ప్రోత్సహిస్తుంది.   

pexels

యోని ఆరోగ్యానికి మేలు- బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల బ్యాక్టీరియా, ఈస్ట్‌ పెరుగుదలను ప్రోత్సహించే వాతావరణం సృష్టిస్తాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌లకు కారణం అవుతాయి. నగ్నంగా నిద్ర వల్ల ఈ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.   

pexels

దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

image credit to unsplash