మీ వంటకాలను తియ్యగా చేసేందుకు చక్కెరకు ప్రత్యామ్నాయమైన 7 పదార్థాల గురించి తెలుసుకుందాం. 

pexels

By Bandaru Satyaprasad
Apr 29, 2024

Hindustan Times
Telugu

మాపుల్ సిరప్ - మాపుల్ చెట్ల బెరడు నుంచి దీనిని తీస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. చక్కెరకు ప్రత్యామ్నాయంగా మాపుల్ సిరప్ వినియోగిస్తారు. 

twitter

తేనె- పువ్వుల మకరందంతో తేనెటీగలు ఉత్పత్తి చేసే సహజ స్వీటెనర్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. తేనె యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

pexels

స్టెవియా- దీనిని స్టెవియా రెబాడియానా మొక్క ఆకుల నుంచి తీస్తారు. ఇది తీపిగా ఉంటుంది కానీ కేలరీలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు. డయాబెటిక్ వారికి అద్భుతమైన ఎంపిక.   

twitter

కొబ్బరి చక్కెర- కొబ్బరితో తయారు చేసే ఈ చక్కెరలో ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్ల వంటి పోషకాలు ఉంటాయి. సాధారణ చక్కెరతో పోలిస్తే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  

twitter

మాంక్ ఫ్రూట్ స్వీటెనర్ - మాంక్ ఎఫ్ రూట్ నుంచి తయారుచేసిన ఈ స్వీటెనర్ లో కేలరీలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. చక్కెర తీసుకోవడం తగ్గించాలని చూస్తున్న వారికి  ఇది మంచి ఎంపిక.  

twitter

ఖర్జూరం పేస్ట్ -  ఖర్జూరం పేస్ట్ ను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఇందులో ఫైబర్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పేస్ట్ మీ వంటకాలకు నాచురల్ స్వీట్నెస్ ను యాడ్ చేస్తుంది.   

twitter

బెల్లం - చెరకు రసం లేదా తాటి రసం నుంచి దీనిని తయారు చేస్తారు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. చక్కెరతో పోలీస్తే ఇది తక్కు గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది.   

twitter

డయాబెటిస్ ఉన్న వాళ్లు కొన్ని పండ్లను అస్సలు తినకూడదు. మరి ఆ పండ్లు ఏవో ఇక్కడ చూడండి

pexels