పిల్లలలో కడుపు నొప్పి తీవ్రతను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించాలి.   

pexels

By Bandaru Satyaprasad
Feb 14, 2024

Hindustan Times
Telugu

అజీర్ణం- పిల్లల్లో తరచూ అజీర్ణం సమస్యలు వస్తుంటాయి. కడుపులో నొప్పి లేదా మంట అంటూ పిల్లలు బాధపడుతుంటారు. ఇది అజీర్ణానికి సంకేతం.. దానంతట అదే తగ్గిపోతుంది. కాస్త చప్పగా ఉండే ఆహారాన్ని పెట్టండి. పిల్లల్లో అసౌకర్యం కొనసాగితే వైద్యులను సంప్రదించండి.   

pexels

వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్- నీళ్ల విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి, నొప్పి, వికారం లేదా వాంతులు ఉంటే వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించండి. పిల్లలు 100.4 F లేదా అంతకంటే ఎక్కువ జ్వరం, రక్తపు విరేచనాలు లేదా నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఈ సమస్య ఉంటే పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగించాలి.   

pexels

మలబద్ధకం- మలబద్ధకం ఉన్న పిల్లలకు తరచుగా కడుపునొప్పితో బాధపడతారు. తినడానికి ఇష్టపడకపోవడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన మలం లేదా మలబద్ధకం ఉంటే వైద్యుని సంప్రదించండి. 

pexels

ఒత్తిడి లేదా ఆందోళన- పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆత్రుతగా ఉన్నప్పుడు, వారి శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను రక్తంలోకి విడుదలవుతుంది. ఇది కడుపు తిమ్మిరి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  

pexels

అపెండిసైటిస్ - అపెండిసైటిస్ అనేది అపెండిక్స్ వాపు. దీని వల్ల ఆకస్మిక నొప్పి కలుగుకుంది. బొడ్డు చుట్టూ నొప్పి మొదలై దిగువ కుడివైపు ఉంటుంది. పిల్లలు దగ్గినప్పుడు, నడవడం లేదా ఇతర కదలికలతో నొప్పి ఎక్కువ అవుతుంది. అపెండిసైటిస్ వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, పిల్లలకు వెంటనే వైద్య సహాయం అందించాలి. 

pexels

పేగుల్లో అడ్డంకులు- పిల్లల చిన్న పేగు లేదా పెద్ద పేగు గుండా ఆహారం లేదా ద్రవాలు వెళ్లకుండా అవరోధం ఏర్పడుతుంది. పిల్లలు ఏదైనా వస్తువును మింగడం వల్ల ఇలా జరగవచ్చు. మలబద్ధకం, కడుపు వాపు, వాంతులు ఉంటే పేగులో అడ్డంకి ఏర్పడిందని అనుమానించి వైద్య సహాయం తీసుకోండి.  

pexels

కడుపు నొప్పి తీవ్రమైతే జ్వరం, రక్తపు మలం, వికారం, వాంతులు, చర్మం పసుపు రంగులోకి మారడం, కడుపు వాపు లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మలబద్దకం సమస్య తగ్గించడానికి పిల్లలకు ఎక్కువగా నీళ్లు తాగించండి.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels