బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి నెయ్యి మంచిదని అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడానికి నెయ్యి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jan 09, 2024
Hindustan Times Telugu
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది- నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్, చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం పోషకాలను సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేయడంతో బరువు తగ్గడానికి పరోక్షంగా సాయపడుతుంది.
unsplash
కొవ్వులో కరిగే విటమిన్లు- నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీస యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. నెయ్యిల్లో A, E, D వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
pexels
కొవ్వులో కరిగే విటమిన్లు- నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీస యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. నెయ్యిల్లో A, E, D వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
unsplash
థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది- మీరు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే, బరువు పెరుగుతుంటే, మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవాలి. నెయ్యి అయోడిన్ మూలం. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును ప్రోత్సహిస్తుంది. నెయ్యిలో థైరాయిడ్ పనితీరుకు తోడ్పడే చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా సహాయపడతాయి.
pexels
జీవక్రియను మెరుగుపరుస్తుంది- నెయ్యిలో ఉండే సంతృప్త కొవ్వులను మితంగా వినియోగిస్తే జీవక్రియను(మెటబాలిజమ్) మెరుగుపరుస్తాయి. నెయ్యిలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. త్వరగా శక్తిగా మారతాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
pexels
అధిక నెయ్యితో దుష్ప్రభావాలు- నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీవక్రియకు మద్దతునిస్తాయి. బరువు నిర్వహణను ప్రోత్సహిస్తాయి. కానీ నెయ్యి క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం. నెయ్యి అధికంగా వినియోగిస్తే బరువు పెరగడానికి కారణం అవుతుంది.
pexels
బరువు తగ్గడానికి నెయ్యిని మితంగా వాడడం చాలా ముఖ్యం. నూనెలకు బదులుగా వెన్నకు వంటలో చేర్చండి. చపాతీలకు అప్లై చేయడం, సూప్‌లు, పప్పులో కలిపి తినండి. చలికాలంలో మీ ఆహారాల్లో ఒక చెంచా నెయ్యి జోడించడం వల్ల రుచితో పాటు మరిన్ని పోషకాలను జోడించవచ్చు.
unsplash
డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌తో భారీ ఆర్థిక నష్టం- ఇలా సేఫ్‌గా ఉండండి..