ఐరన్ మన శరీరానికి ఎంతో కీలకం. ఇది కణాలకు ఆక్సిజన్ ను రవాణా చేయడానికి, శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఐరన్ కూరగాయలు, ఆకుకూరల్లో కూడా పుష్కలంగా లభిస్తుంది. ఎనిమియాతో పోరాడే 7 ఐరన్ రిచ్ వెజిటబుల్స్ గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Sep 16, 2024

Hindustan Times
Telugu

పాలకూర- ఈ ఆకుకూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రా. పాలకూరలో 2.7 మి.గ్రా ఐరన్ ఉంటుంది. వండిన వాటికంటే పచ్చి ఆకుకూరల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. పాలకూర గుండె, ఎముకలు, జీర్ణవ్యవస్థకు మంచిది.  

pexels

కొల్లార్డ్ గ్రీన్స్ - హిమోగ్లోబిన్ ఉత్పత్తి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు కొల్లార్డ్ గ్రీన్స్ ఉపయోగపడతాయి. ఒక కప్పు కొల్లార్డ్ గ్రీన్స్ లో 2.5 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కు గొప్ప మూలం.  

pexels

బ్రోకలీ - బ్రోకలీలో అధిక మొత్తంలో ఐరన్, విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం ఐరన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది. దీని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.  

pexels

బంగాళాదుంపలు-  బంగాళాదుంపలు ఐరన్ కంటెంట్ కు మంచి మూలం. పొట్టుతో ఉన్న ఆలూలో 1.9 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఫైబర్, పోషకాలను కలిగి ఉంటాయి.  

pexels

వైట్ పుట్టగొడుగులు - కెలరీలు, చక్కెర తక్కువగా ఉంటే తెల్ల పుట్టగొడుగుల్లో ప్రోటీన్, విటమిన్ డి, బీ12 వంటి పోషకాలు ఉంటాయి. వీటిల్లో 100 గ్రాములకి 0.5 మి.గ్రా ఐరన్ ఉంటుంది.  

pexels

పచ్చి బఠానీలు -  100 గ్రాముల బఠానీల్లో 1.5 మి.గ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది. మీ ఆహారాల్లో బఠానీలను సైడ్ డిష్ గా వాడవచ్చు.  

pexels

బీట్ రూట్ - 100 గ్రాముల బీట్ రూట్ లో 0.8 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి.    

pexels

 సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి

Photo: Pexels