ఈ ఐదు విధాలుగా నీరు తాగడం మంచిదికాదు  

unsplash

By Bandaru Satyaprasad
Oct 25, 2023

Hindustan Times
Telugu

మీరు నీరు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నీరు తాగేటప్పుడు ఈ 5 విధాలుగా చేయకండి.   

pixabay

అధికంగా నీరు తాగడం- ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల అనారోగ్యం కలగవచ్చు. అధిక నీరు శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. 

HT Telugu

దాహంగా ఉన్నా నీరు తాగకపోవడం- మీరు దాహం వేసినప్పుడు నీరు తాగకపోతే శరీర పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి తరచూ నీరు తాగాలి. 

unsplash

నిలబడి నీరు తాగడం వల్ల శరీరం సమర్థవంతంగా లిక్విడ్స్ గ్రహించడానికి అనుమతించదు. కాబట్టి ఇది సరైన జీర్ణక్రియకు సహకరించదు. కూర్చొని నెమ్మదిగా నీరు తీసుకోవడం మంచిది.  

pixabay

ఆర్టిఫీషియల్ స్వీట్నర్లను కలుపుకోవడం   

pixabay

నీటి రుచిని పెంచేందుకు కృత్రిమ స్వీట్నర్లను కలుపుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. దీని బదులు నిమ్మకాయ లేదా దోస వంటి సహజ పదార్థాలు తీసుకోవచ్చు.  

unsplash

నీటిని చాలా వేగంగా తాగడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. మీ శరీరం నీటిని సమర్ధవంతంగా గ్రహించేందుకు, జీర్ణ సమస్యలను నివారించడానికి నెమ్మదిగా నీటిని సిప్ చేయండి.

pixabay

చలికాలంలో బాదాం, కాజు, వాల్‌నట్స్‌, ఖర్జూరాలు వంటివి తింటే వాటిలోని మంచి కొవ్వులతోపాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గుణం మేలు చేస్తుంది

pexels