కొంత మందికి బాగా వర్క్ చేసి అలసిపోయినా నిద్రపోవడానికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు నిద్ర పట్టకపోవడానికి కారణం కావొచ్చు. ఇలాంటప్పుడు నిద్రపట్టడానికి మీకు సహాయపడే చిట్కాలను తెలియజేస్తున్నాం.
pexels
By Bandaru Satyaprasad Oct 01, 2024
Hindustan Times Telugu
అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. రేసింగ్ మైండ్ నిద్రపట్టకపోవడానికి పెద్ద అడ్డంకి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. డీప్ బ్రీత్ తీసుకుని నెమ్మదిగా వదలండి. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా మారి నిద్ర పట్టడానికి అవకాశం ఉంది.
pexels
మీరు మంచంపై పడుకుని ఉండి, నిద్రపోకపోతే లేచి ఏదైనా పుస్తకాన్ని చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం చాలా ఉత్తమం. ఇలా చేస్తే మైండ్ ప్రశాంతంగా అయ్యి నిద్ర పట్టొచ్చు.
pexels
పోడ్‌కాస్ట్ వినండి- రిలాక్సింగ్ పాడ్‌క్యాస్ట్ వినడం వలన నిద్ర లేమి నుంచి మీ దృష్టిని మరల్చవచ్చు. ప్రశాంతమైన సంగీతం మిమ్మల్ని ఉత్తేజపరచి నిద్రను ప్రోత్సహిస్తాయి.
pexels
కెఫీన్, భారీ భోజనం మీకు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిద్రవేళకు కొన్ని గంటల ముందు కాఫీ, టీ లేదా చాక్లెట్‌లను తీసుకోవడం మానుకోండి. కెఫీన్ మీ సిస్టమ్‌లో ఆరు గంటల వరకు ఉంటుంది. పడుకునే ముందు భారీగా భోజనం అజీర్ణానికి కారణమవుతుంది. నిద్రను కష్టతరం చేస్తుంది. ఆల్కహాల్‌ను పరిమితం చేయండి.
pexels
స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. పడుకునే ముందు సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడటం వల్ల మిమ్మల్ని ఎక్కువసేపు మేల్కొని ఉంచుతుంది. నిద్రకు కనీసం 30 నిమిషాల ముందు మీ పరికరాలను దూరంగా ఉంచండి.
స్థిరమైన నిద్ర సమయాలను అనుసరించండి. మీ మెదడుకు ఇది నిద్రపోయే సమయం అని సూచించడంలో సహాయపడుతుంది. రాత్రి నిద్ర పోయే ముందు వెచ్చని నీటితో స్నానం చేసినా , చదవడం లేదా విశ్రాంతి వ్యాయామాలు చేయడం అలవాటుగా పెట్టుకోండి.
pexels
నిద్రకు ముందు ముఖ్యమైన పనులు, తీవ్రమైన వ్యాయామం లేదా ఒత్తిడితో కూడిన సంభాషణలు ఆడ్రినలిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి. మీ సాయంత్రాలను వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా ఉంచండి.
pexels
సాధారణ వర్డ్ గేమ్ ఆడటం ఇతర ఆలోచనలు దూరం చేసి మెదడుకు విశ్రాంతి భావనను కలిగిస్తుంది. వర్డ్ గేమ్‌లు గొప్ప ఎంపిక ఎందుకంటే అవి మిమ్మల్ని ఇతర ఆలోచనల నుంచి దృష్టి మరల్చడానికి సాయపడతాయి.