రోజులో ఎన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిది?

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jan 09, 2024

Hindustan Times
Telugu

వెల్లుల్లిని పచ్చిగా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వంటల్లో వేసిన దాన్ని కన్నా.. పచ్చిగా తీసుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. 

Photo: Unsplash

అయితే, రోజులో రెండు నుంచి మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను మాత్రమే తినాలి. ఎక్కువ తింటే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. రోజులో రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి. 

Photo: Unsplash

వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండడం వల్ల జీర్ణానికి వెల్లుల్లి మేలు చేస్తుంది. 

Photo: Unsplash

జలుబు, దగ్గు తగ్గేందుకు కూడా వెల్లుల్లి సహకరిస్తుంది. గొంతు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Photo: Unsplash

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. 

Photo: Unsplash

బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేందుకు కూడా వెల్లుల్లి ఉపకరిస్తుంది. ఇలా గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. 

Photo: Unsplash

పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. 

Photo: Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels