బ్లాక్ టీతో బరువు తగ్గడమే కాదు.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Oct 07, 2023
Hindustan Times Telugu
బ్లాక్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.
image credit to unsplash
బ్లాక్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫైటోన్యూట్రియెంట్లు శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది.
image credit to unsplash
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి
image credit to unsplash
బ్లాక్ టీలో కెఫీన్, ఎల్-థియనైన్ అనే ఒక రకమైన అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శక్తిని, దృష్టిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.
image credit to unsplash
బ్లాక్ టీని మితంగా తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల బ్లాక్ టీ తాగడం సరైనది అంటున్నారు నిపుణులు.
image credit to unsplash
ఆహారం జీర్ణం కావడానికి బ్లాక్ టీ మంచిది. అల్పాహారం, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఒక కప్పు బ్లాక్ టీ తాగడాన్ని సిఫార్సు చేస్తున్నారు.
image credit to unsplash
బ్లాక్ టీలో అత్యధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మేలు చేస్తుంది.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి