సరైన షాంపూ, కండీషనర్ తో పాటు జుట్టు పెరుగుదలకు ఈ 5 రకాల విత్తనాలను మీ డైలీ డైట్ చేర్చుకోండి. మీ సీడ్స్ హెయిర్ గ్రోత్ కు సహాయపడే విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.  

pexels

By Bandaru Satyaprasad
Jun 05, 2024

Hindustan Times
Telugu

చియా సీడ్స్ - చియా గింజల్లోని కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఫైబర్ బలమైన, మెరిసే జుట్టును ప్రోత్సహిస్తాయి. చియా గింజల్లో ఉండే జింక్, కాపర్ జుట్టు విరగకుండా నిరోధిస్తుంది.  

unsplash

అవిసె గింజలు - ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసె గింజలు హెయిర్ ఫోలికల్స్ ను ప్రోత్సహిస్తాయి. స్కాల్ప్ హెల్త్ ను పెంపొందిస్తాయి. జుట్టు పల్చబడటం, రాలడాన్ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు అవిసె గింజల్లో ఉన్నాయి.  

unsplash

నువ్వులు - నలుపు, తెలుపు నవ్వులు రెండింటిలో జుట్టు పెరుగుదలకు అవసరమైన మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ల వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పొడి స్కాల్ప్ ను హైడ్రేట్ చేస్తాయి.  

pexels

పొద్దుతిరుగుడు విత్తనాలు  

unsplash

పొద్దు తిరుగుడు విత్తనాల్లోని విటమిన్-ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్  తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. వీటిని రోజుకు 30 గ్రాములు తీసుకోవడం మంచిది.  

pexels

 మెంతులు 

unsplash

మెంతుల్లో అధిక ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉన్నాయి. మెంతులు జుట్టు షాఫ్ట్ లను బలోపేతం చేయడానికి, వెంట్రుకలు విరిగిపోకుండా నిరోధిస్తుంది. ఇందులోని విటమిన్లు ఏ, సీ, కే, ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.  

pexels

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

Image Source from unsplash