అరటి పండుతో చర్మానికి, జుట్టుకు కూడా మేలు! ఎలాగంటే..

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 30, 2023

Hindustan Times
Telugu

అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అరటిలో ఉండే పోషకాలు, విటమిన్లు మేలు చేస్తాయి. చర్మ సౌందర్యానికి, జట్టుకు కూడా అరటి పండు తోడ్పడుతుంది. 

Photo: Unsplash

మీ డైట్‍లో అరటి పండు యాడ్ చేసుకొని తినడం వల్ల చర్మానికి, వెంట్రుకలకు మేలు జరుగుతుంది. ఎలాగో ఇక్కడ చూడండి. 

Photo: Unsplash

చర్మంపై వాపు, మొటిమలను తగ్గిస్తుంది

Photo: Unsplash

అరటిలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో ఇవి తింటే చర్మంపై ఆక్సిడేటివ్ ఒత్తిడి, వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. మొటిమలు, దద్దర్లు రాకుండా నివారిస్తుంది. 

Photo: Unsplash

స్కాల్ప్ ఆరోగ్యం మెరుగు

Photo: Unsplash

అరటిలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ (వెంట్రుకల కుదుళ్లు)కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రంధ్రాలకు పోషకాలు అందుతాయి. డాండ్రఫ్, వెంట్రుకల డ్యామేజీని అరటి తగ్గిస్తుంది. 

Photo: Unsplash

అరటి పండు తింటే మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మీ స్కిన్‍ను ఇది హైడ్రేటెడ్‍గా ఉంచుతుంది. విటమిన్లు, మినరల్స్  ఉండటంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. 

Photo: Unsplash

అరటి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు టెక్స్చర్‌ను మెరుగుపరుస్తుంది. మీ చర్మాన్ని బిగుతుగా చేసి.. మడతలను తగ్గిస్తుంది.

Photo: Unsplash

ఫైబర్​ అధికంగా ఉండే ఫుడ్స్​తో ఆరోగ్యానికి ఆరోగ్యం- వెయిట్​ లాస్​ కూడా!

pexels