చర్మం ఎక్కువ జిడ్డుగా ఉంటోందా? ఈ 5 రకాల ఫుడ్స్ తీసుకోండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 09, 2024

Hindustan Times
Telugu

చర్మం ఎక్కువగా జిడ్డు ఉండడం వల్ల మొటిమలు లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. జిడ్డు చర్మం సమస్య తగ్గేందుకు కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వారు ఈ 5 రకాల ఫుడ్స్ మీ డైట్‍లో తీసుకోండి. 

Photo: Pexels

క్యారెట్లలో బీటా కరోటెన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేడెట్‍గా ఉంచుతుంది. చర్మపు బిగుతును మెరుగుపరుస్తుంది. చర్మంపై జిడ్డు ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు మెటమలను నివారిస్తుంది. 

Photo: Pexels

ఆరెంజ్, అవొకాడో, యాపిళ్లు లాంటి పండ్లు తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్‍గా ఉండటంతో పాటు పోషకాలు అందుతాయి. ఇవి చర్మంపై జిడ్డును తగ్గించగలవు. మొటిమలు, మచ్చలు తగ్గేందుకు ఉపయోగపడతాయి. 

Photo: Pexels

కాయ, పప్పు ధాన్యాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సెబమ్ ఉత్పత్తిని ఇవి నియంత్రించి, చర్మానికి పోషకాలు అందిస్తాయి. మొటిమలను తగ్గించగలవు.

Photo: Pexels

బ్రకోలీ, క్యాబేజీ లాంటి క్యాలిఫ్లవర్స్ కూరగాయాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. సెబమ్ ఉత్పత్తిని రెగ్యులేట్ చేసి.. చర్మ సమస్యలను తక్కువ చేయగలవు. 

Photo: Pexels

బార్లీ, ఓట్ మీల్, క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి ధాన్యాలు కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చర్మపు ఆయిల్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. 

Photo: Pexels

గుమ్మడి గింజలు ఎలా తింటే మేలు?

Photo: Pexels