బరువు తగ్గేందుకు సలాడ్లు తింటున్నారా? వాటిలో ఈ ఫుడ్స్ యాడ్ చేసుకోండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Oct 02, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గేందుకు కూరగాయలతో కూడిన సలాడ్లు తినడం చాలా మేలు చేస్తుంది. అయితే, వాటిలో కొన్ని ఫుడ్స్ జత చేసుకోవడం వల్ల వెయిట్ లాస్‍కు మరింత బాగుంటుంది. సలాడ్లలో యాడ్ చేసుకోవాల్సిన ఫుడ్స్ ఏవంటే..
Photo: Pexels
ఉడికించిన క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ లాంటి తృణధాన్యాలను సలాడ్లలో వేసుకోవచ్చు. వీటిలో కార్బ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడాన్ని ఈ ధాన్యాలు వేగవంతం చేస్తాయి.
Photo: Pexels
పిస్తాలు, బాదం, ఆక్రోటు, చియా, ఫ్లాక్స్ లాంటి నట్స్, విత్తనాలు కూడా సలాడ్‍లో యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి.
Photo: Pexels
పాలకూర, కేల్, తోటకూర లాంటి ఆకుకూరలను కాస్త ఉడికించి సలాడ్‍లో వేసుకొని తినొచ్చు. దీనివల్ల సలాడ్‍లో ఫైబర్, మినరల్స్ బాగా పెరుగుతాయి. వెయిట్ లాస్ వేగంగా అయ్యే అవకాశాలు ఉంటాయి.
Photo: Pexels
అరటి, యాపిల్స్, బెర్రీలు, ఆరెంజ్ లాంటి పండ్లను సలాడ్‍లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. వీటి వల్ల సలాడ్‍లో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ అధికమవుతాయి. బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
బీన్స్, శనగలు లాంటి ఉడికించిన పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు సలాడ్‍లో వేసుకొని తినాలి. దీనివల్ల ప్రొటీన్, ఫైబర్ శరీరానికి బాగా అందుతాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
విటమిన్ సీ తో అనేక ప్రయోజనాలు - వీటిని తెలుసుకోండి