శరీరంలోని అవయవాలు మెరుగ్గా పని చేయాలంటే రక్తంలో సరిపడా ఆక్సిజన్ ఉండడం చాలా ముఖ్యం. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచగల ఐదు రకాల పుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
దానిమ్మలో ఐరన్, కాపర్, జింక్ లాంటి ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. ఈ పండు తింటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగేందుకు తోడ్పడుతుంది. ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను కూడా మెరుగుపరుస్తుంది.
Photo: Pexels
బీట్‍రూట్‍లో విటమిన్ బీ6, మాగ్నీస్, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రక్తానికి ఆక్సిజన్ సరఫరాను ఇది మెరుగుపరుస్తుంది.
Photo: Pexels
స్ట్రాబెర్రీ, రాస్ప్ బెర్రీ, బ్లాక్ బెర్రీ లాంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి తింటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి మెరుగవుతుంది.
Photo: Pexels
పాలకూరలో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణను, ఆక్సిజన్ లెవెళ్లను ఈ ఆకుకూర పెంచగలదు.
Photo: Pexels
అవకాడోల్లో శరీరానికి అవసరమైన కీలక విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫోలెట్, కోలైన్ ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తంలో ఆక్సిజన్ పెరిగేందుకు ఈ పండు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!