కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల కాస్త వేగంగా బరువు తగ్గొచ్చు. కొన్ని ఫుడ్ కాంబినేషన్లు వెయిట్ లాస్‍కు తోడ్పడతాయి. అలా.. కలిపి తింటే బరువు తగ్గేందుకు సహకరించే ఫుడ్ కాంబినేషన్లు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
యగర్ట్, స్ట్రాబెర్రీలను కలిపి తింటే బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. యగర్ట్‌లో క్యాలరీలను కరిగించే గుణం, స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వెయిట్ లాస్‍కు సహకరిస్తాయి. స్ట్రాబెర్రీలతో కలిపి పెరుగు కూడా తినొచ్చు.
Photo: Pexels
ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కలిపి తింటే త్వరగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి.
Photo: Pexels
ఓట్స్, బాదం, ఆక్రోటు లాంటి నట్స్ కలిపి తినడం వల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఓట్స్‌లో ఫైబర్, నట్స్‌లో మోనోఅన్‍సాచురేటెడ్, పాలిఅన్‍సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీంతో ఇవి తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.
Photo: Pexels
పీనట్ బటర్, యాపిల్ కలిపి తినడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చు. యాపిల్‍లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. పీనట్ బటర్‌లో పాలిసాచురేటెడ్ యాసిడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
Photo: Pexels
బరువు తగ్గేందుకు కోడిగుడ్లు, క్యాప్సికం కూడా కలిపి తినొచ్చు. కోడిగుడ్లు జీవక్రియలను వేగవంతం చేసి వెయిట్ లాస్‍కు ఉపకరిస్తాయి. క్యాప్సికమ్ ఆకలిని తగ్గిస్తుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి