గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ తప్పక పాటించండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 23, 2024
Hindustan Times Telugu
శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. అందుకే అది ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ప్రతీ రోజు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ప్రతీ రోజు తప్పనిసరిగా శారీరక ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. దీనివల్ల గుండె కండరాలు బలంగా ఉండటంతో పాటు క్యాలరీలు నియంత్రణలో ఉంటాయి. యోగా, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయాలి.
Photo: Pexels
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండే ఆహార పదార్థాలను తినాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Photo: Pexels
మద్యం తాగడం, పొగతాగడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. గుండె పోటు రిస్క్ పెరుగుతుంది. అందుకే ఆల్కహాల్, పొగ తాగడం అసలు చేయకూడదు. అలవాటు ఉంటే మానుకోవాలి.
Photo: Pexels
వంటకాల్లో నూనెను కూడా తగ్గించాలి. నూనె వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండెకు సమస్యగా ఉంటుంది. అన్‍సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, గ్రేప్‍సీడ్ ఆయిల్ లాంటివి వాడితే మేలు.
Photo: Pexels
ఒకవేళ మీకు గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడుతూ వైద్యం చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు.
Photo: Pexels
బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ లెవెళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటూ గుండెపై ప్రభావం పడకుండా చేసుకోవచ్చు.
Photo: Pexels
వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలను తీసుకోవడం మన శరీరానికి చాలా అవసరం.