జుట్టు పలుచబడే సమస్య కొందరికి ఉంటుంది. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంటోంది. జుట్టు పలుచబడడాన్ని తగ్గించేందుకు ఈ 5 సూచనలు పాటించండి.
Photo: Pexels
కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్, ఆముదం లాంటి నేచురల్ ఆయిల్స్‌తో మాడుకు (స్కాల్ప్), జుట్టు కుదుళ్లకు మాసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై జుట్టు బలపడుతుంది. పలుచబడడం తగ్గుతుంది.
Photo: Pexels
విటమిన్ ఏ,సీ,ఈ, బయోటిన్, జింక్, ఐరన్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి పోషకాలు ఉన్న ఆహారాలు తినాలి. దీనివల్ల వెంట్రుకలకు ఎక్కువ బలం చేకూరుతుంది. జుట్టు పలుచబడకుండా ఈ పోషకాలు తోడ్పడతాయి.
Photo: Pexels
జుట్టుకు హెయిర్ డ్రయర్లు, స్ట్రైటనర్లు, కర్లింగ్ ఐరన్స్ లాంటి హీట్ స్టైలింగ్ టూల్స్ వాడడం తగ్గించండి. అవి ఎక్కువగా వాడితే జుట్టు బలహీనపడుతుంది.
Photo: Pexels
ఆలోవేరా జెల్ హెయిర్ మాస్క్, ఉల్లిపాయ (ఆనియన్) జ్యూస్ లాంటివి జుట్టుకు రాసుకోవాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యం పెరిగి.. పలుచబడడం తగ్గుతుంది.
Photo: Pexels
తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా జుట్టుకు మంచిది కాదు. అందుకే ఒత్తిడి తగ్గేలా మెడిటేషన్ చేయాలి. వ్యాయామం చేయడం కూడా వెంట్రుకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Photo: Pexels
స్విమ్ సూట్‌లో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ షో