విటమిన్ బీ ఎక్కువగా ఉండే ఐదు వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 09, 2024

Hindustan Times
Telugu

శరీరానికి విటమిన్ బీ చాలా ముఖ్యమైనది. చేప, మాంసంల్లో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే, శాకాహారులు (వెజిటేరియన్స్) వాటిని తినరు. అయితే, విటమిన్-బీ పుష్కలంగా ఉండే వెజిటేరియన్ ఆహారాలు కూడా ఉన్నాయి. అవేవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

బార్లీ, బ్రౌన్ రైస్, క్వినోవా లాంటి తృణ ధాన్యాల్లో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. డైట్‍లో ఈ ధాన్యాలను తీసుకుంటే మేలు. 

Photo: Pexels

పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో విటమిన్ బీ2 మెండుగా ఉంటుంది. అందుకే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా తినాలి.

Photo: Pexels

పుట్టగొడుగుల్లోనూ విటమిన్ బీ3 పుష్కలంగా ఉంటుంది. ఇవి తిన్నా ఈ విటమిన్ శరీరానికి బాగా అందుతుంది. 

Photo: Pexels

శనగలు, పచ్చి బఠానీలు, చిక్కుళ్లు, సోయాబీన్స్, బీన్స్, వేరుశనగ కాయలు లాంటి కాయధాన్యాల్లో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ డైట్‍లో ఇవి ఉండేలా చూసుకోవాలి. 

Photo: Pexels

బాదం, జీడిపప్పు, పిస్తాలు, గుమ్మడి విత్తనాలు లాంటి నట్స్, విత్తనాల్లో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని కూడా రెగ్యులర్‌గా తినడం మేలు. 

Photo: Pexels

చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Photo: Pexels