మన చర్మం ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. మీ చర్మపు ఆరోగ్యం, మెరుపు పెరిగేందుకు మీ ఆహారంలో తీసుకోవాల్సిన ఐదు రకాల కూరగాయలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
చిలగడదుంపల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీటా కరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే చర్మం ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మం పొడిబారడం, సన్ బర్న్స్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Photo: Pexels
కేల్‍లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే కొలేజన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఇది చర్మం ఆరోగ్యానికి సహకరిస్తుంది.
Photo: Pexels
క్యారెట్లలో విటమిన్ ఏ, కరొటెనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మంపై మచ్చలను తగ్గించటంతో పాటు స్కిన్ డ్యామేజ్‍ను ఇవి నిరోధించగలవు.
Photo: Pexels
టమాటాల్లో లికోపిన్, లుటిన్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే చర్మం మెరుపు పెరుగుతుంది.
Photo: Pexels
బ్రకోలీలో విటమిన్ సీ, విటమిన్ ఏ, కరోటిన్ పుష్కలం. దీంతో చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో ఇది ఉపకరిస్తుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి