కళ్ల ఆరోగ్యం కోసం ఐదు సులువైన ఎక్సర్‌సైజ్‍లు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 09, 2024

Hindustan Times
Telugu

ఐ ఎక్సర్‌సైజ్‍లు (కంటి వ్యాయామాలు) చేయడం వల్ల కళ్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కళ్లు అలిసిపోవడం, నొప్పి సహా చాలా సమస్యలు వీటి వల్ల తగ్గుతాయి. ముఖ్యమైన కళ్ల ఎక్సర్‌సైజ్‍లు ఇవే.

Photo: Pexels

ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు పని చేసే వారికి 20-20-20 రూల్ ముఖ్యమైన కళ్ల ఎక్సర్‌సైజ్. వర్క్ చేసేటప్పుడు ప్రతీ 20 నిమిషాలకు ఓసారి సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును.. 20 సెకన్ల పాటు చూడాలి. దీనివల్ల కళ్ల అలసట తగ్గుతుంది. 

Photo: Pexels

20 సెకన్ల పాటు కనురెప్పలను వేగంగా కొట్టాలి. దీనివల్ల కళ్లు పొడిబారకుండా.. మాయిశ్చరైజింగ్‍గా ఉంటాయి. 

Photo: Pexels

ఫోకస్ మార్చే ఎక్సర్‌సైజ్ కూడా కళ్లకు మంచి చేస్తుంది. ముందుగా దగ్గరగా ఉన్న ఓ వస్తువును కొన్ని సెకన్ల పాటు ఏకాగ్రతతో చూడాలి. ఆ తర్వాత దూరంగా ఉన్న వస్తువుపై కొన్ని సెకన్లు ఫోకస్ చేయాలి. దీనివల్ల కళ్లు ఫ్లెక్సిబులిటీ పెరగటంతో పాటు అలసట తగ్గుతుంది. 

Photo: Pexels

రెండు అరచేతులను బాగా రుద్దుకొని కాస్త వెచ్చగా చేసుకోవాలి. ఆ తర్వాత అరచేతులను కళ్లపై పెట్టుకోవాలి. అలా కొన్నిసార్లు చేయాలి. దీనివల్ల కళ్లు బాగా రిలాక్స్ అవుతాయి.  

Photo: Pexels

కళ్లను గుండ్రగా గింగిరాలు తిప్పాలి. ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ వల్ల కళ్లలో తేమ పెరుగుతుంది. క్లాక్‍వైజ్, యాంటీ క్లాక్‍వైజ్ కనుగుడ్లను తిప్పాలి. 

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels