శరీరంలో తగినంత స్థాయిలో మెగ్నిషియం ఉండాలి. లేకపోతే నీరసం, వికారం, కండరాల నొప్పి సహా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందుకే మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. మెగ్నిషియం ఎక్కువగా ఉండే ఐదు పండ్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
అవకాడో పండ్లలో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ సీ, బీ6, ఈ, ఫోలెట్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుకే అవకాడో రెగ్యులర్‌గా తినడం మంచిది.
Photo: Pexels
అరటి పండులో మెగ్నిషియం పుష్కలం. విటమిన్ బీ6, సీ, ఐరన్ కూడా మెండుగా ఉంటాయి. అరటిని రోజూ తింటే ఓవరాల్ ఆరోగ్యానికి చాలా మేలు.
Photo: Pexels
మెగ్నిషియం ఎక్కువగా ఉండే పండ్లలో బ్లూబెర్రీలు కూడా ఉన్నాయి. ఈ పండ్లలో మెగ్నిషియం సహా పొటాషియం, ఫోలెట్, కాల్షియం సహా మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
Photo: Pexels
బొప్పాయి పండులోనూ మెగ్నిషియం బాగా ఉంటుంది. విటమిన్ సీ, ఏ, ఫైబర్, కాల్షియం కూడా ఎక్కువే. బొప్పాయి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
Photo: Pexels
మెగ్నిషియం కావాలంటే జామ పండ్లను తినొచ్చు. ఈ పండులోనూ ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ, బీ6, ఫైబర్, ప్రొటీన్ కూడా ఈ పండులో ఉంటాయి.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి