చాలా మంది చర్మం మెరుపును పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. గ్లోయింగ్ స్కిన్ కోసం మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యం. చర్మపు మెరుపును పెంచే ఐదు రకాల పండ్లు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
కివీ పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలాజెన్ ఉత్పత్తిని అధికంగా చేయడంతో పాటు చర్మపు మెరుపును కివీ పండ్లు పెంచుతాయి.
Photo: Pexels
బొప్పాయి తినడం వల్ల కూడా చర్మపు మెరుపు పెరుగుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్.. సహజమైన ఎక్స్‌ఫ్లోలియంట్‍గా పని చేసి డెడ్‍సెల్‍లను తొలగిస్తాయి. దీనివల్ల చర్మపు మెరుపు పెరుగుతుంది.
Photo: Pexels
పైనాపిల్‍లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కంలగా ఉంటాయి. దీనివల్ల చర్మపు ఆరోగ్యం, మెరుపు మెరుగవుతాయి.
Photo: Pexels
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‍బెర్రీలాంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. విటమిన్ సీ, ఈ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చర్మానికి బెర్రీలు చాలా మేలు చేస్తాయి.
Photo: Pexels
నారింజ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. కొలాజెన్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. చర్మం పొడిబారకుండా మెరుపుతో ఉండేందుకు నారింజ పండ్లు తినడం తోడ్పడతాయి.