మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ జీవక్రియ(metabolism) రేటును పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ పానీయాలు ఈ జీవక్రియ రేటును పెంచుకోడానికి సాయపడతాయి.
pixabay
By Bandaru Satyaprasad Sep 12, 2023
Hindustan Times Telugu
అధిక బరువు పునరుత్పత్తి, శ్వాసకోశ పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని పరిశోధకులు తెలిపారు. ఊబకాయం.. మధుమేహం, గుండె జబ్బులతో సహా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.
unsplash
కొందరిలో సహజంగా జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఆహారం, వ్యాయామం, నిద్ర వంటివి జీవక్రియ రేటు పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీవక్రియను వేగవంతం చేసే ఐదు డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
pixabay
గ్రీన్ టీ - బరువు తగ్గడానికి చక్కటి పానీయం. ఇందులో ఉంటే కాటెచిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే బరువు తగ్గే అవకాశం ఉంది.
pixabay
ఆపిల్ సైడర్ వెనిగర్- ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో కలిపి తినడానికి ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు పదార్థాలు కరిగి ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
unsplash
నిమ్మరసంలో మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
unsplash
అల్లం టీ జీవక్రియను పెంచుతుంది. అల్లంలోని థర్మోజెనిక్ లక్షణాలును శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
unsplash
కొంబుచా డ్రింక్- టీ, చక్కెర, బ్యాక్టీరియా, ఈస్ట్ తో పులియబెట్టిన పానీయం. ఇందులో ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఈ డ్రింక్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దీంతో జీవక్రియ రేటు పెరుగుతుంది.
unsplash
చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?