డయాబెటిస్ ఉన్న వారికి 5 బెస్ట్ పండ్లు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Sep 24, 2024

Hindustan Times
Telugu

డయాబెటిస్ (మధుమేహం) ఉన్న వారు తమ డైట్‍లో పండ్లను తినాలి. బ్లడ్ షుగర్ లెవెళ్లను నియంత్రణలో ఉండే వాటిని తీసుకోవడం ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు తినాల్సిన పండ్లలో 5 ముఖ్యమైనవి ఇవి.

Photo: Pexels

యాపిల్ పండ్లను డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చు. యాపిల్‍లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే కారకాలు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెళ్లను తగ్గించగలవు. 

Photo: Pexels

నారింజ పండ్లలో గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో డయాబెటిక్స్ ఉన్న వారు తినేందుకు ఈ పండు మంచి ఆప్షన్.

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారు కివీ పండ్లను తినొచ్చు. వీటిలో గ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లాక్‍బెర్రీలు లాంటి బెర్రీలను డయాబెటిస్ ఉన్న వారు తీసుకోవచ్చు. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గ్లెసిమిక్ ఎండెక్స్ తక్కువగా ఉంటుంది.  

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారికి జామ పండ్లు కూడా మంచి చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెళ్లను జామ పండ్లు నియంత్రించగలవు. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

Photo: Pexels

మొదటిసారి తల్లి అయినప్పుడు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బిడ్డతోపాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

Unsplash