మెరుగైన నిద్ర కోసం తోడ్పడే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 06, 2024

Hindustan Times
Telugu

కొందరికి నిద్రలేమి సమస్య ఉంటుంది. సరిగా నిద్రలేక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా, మెరుగ్గా నిద్ర పట్టేందుకు తోడ్పడే ఐదు రకాల ఆహారాలు ఇవి.

Photo: Pexels

బాదం పప్పులో మెలటోనిన్ అనే హార్మోన్ పుష్కలంగా ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల నిద్ర మెరుగ్గా పడుతుంది. అందుకే రాత్రివేళలో రెండు బాదంపప్పులు తింటే నిద్ర బాగా వచ్చేందుకు ఉపయోగపడుతుంది.  

Photo: Pexels

రాత్రివేళ గోరువెచ్చని పాలు తాగడం వల్ల కూడా నిద్ర మెరుగ్గా వస్తుంది. పాలల్లో ఉండే ట్రైప్టోఫాన్, మెలటోనిన్ నిద్రకు మేలు చేస్తాయి. 

Photo: Pexels

అరటి పండ్లు తిన్నా మంచి నిద్ర వచ్చేందుకు సహకరిస్తుంది. అరటిలో మెగ్నిషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ బీ6, పొటాషియమ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్రకు ఉపకరిస్తాయి. 

Photo: Pexels

నానబెట్టిన చియా సీడ్స్ (సబ్జా గింజలు) తీసుకోవడం వల్ల కూడా గాఢంగా నిద్ర పట్టే అవకాశాలు పెరుగుతాయి. 

Photo: Pexels

ఆక్రోటుకాయలోనూ మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తిన్నా నిద్రకు ఉపకరిస్తుంది. గుమ్మడి కాయ గింజలు కూడా మెరుగైన నిద్రకు సహకరిస్తాయి. 

Photo: Pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash