జడ వేసుకోవడం వల్ల జుట్టుకు కలిగే లాభాలు ఇవే 

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 16, 2024

Hindustan Times
Telugu

ఇటీవలి కాలంలో కొందరు జడలు వేసుకోకుండా లూజ్ హెయిర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ అంటూ లూజ్ హెయిర్ స్టైల్‍లను ఫాలో అవుతున్నారు. అయితే జడ వేసుకోవడం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

జడ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. హెయిర్ బ్రేకేజ్‍ తగ్గుతుంది. వెంట్రుకల బలం పెరుగుతుంది. 

Photo: Pexels

జడ వల్ల వెంట్రుకలు చిక్కులు పడడం తగ్గుతుంది. జడ వేసుకుంటే జుట్టుగా ఒకే చోటు కుదురుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా చిక్కులు పడవు. దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 

Photo: Pexels

జడ వేసుకోవడం వల్ల వెంట్రుకల్లో తేమ మెరుగ్గా ఉంటుంది. పొడిగా అవడం తగ్గుతుంది. జడ వల్ల జుట్టులో తేమ నిలిచి ఉంటుంది. 

Photo: Pexels

జడ వేసుకోవడం వల్ల జుట్టుకు సూర్య కిరణాలు, కాలుష్యం నుంచి ఎక్కువ రక్షణ ఉంటుంది. లూజ్ హెయిర్ ఉంటే వీటి నుంచి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. జడ కట్టుకుంటే వెంట్రుకల చివరలు కూడా ఎక్కువగా రాలవు. 

Photo: Pexels

జడ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లకు కూడా మేలు జరుగుతుంది. కుదుళ్ల దృఢత్వం మెరుగవుతుంది. 

Photo: Pexels

ప్లేట్లెట్ల సంఖ్య అధికమయ్యేందుకు ఈ 5 రకాల పండ్లు తినండి!

Photo: Pexels