మనిషి శరీరానికి విటమిన్లు ఎందుకు అవసరం? ఏ ఆహారాలు తీసుకోవాలి?

Pixabay

By Sharath Chitturi
Oct 24, 2023

Hindustan Times
Telugu

విటమిన్​ ఏ తో గుండె, లంగ్స్​, లివర్​ వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. బ్రోకలీ, క్యారెట్​, ఆకుకూరల్లో విటమిన్​ ఏ పుష్కలంగా లభిస్తుంది.

Pixabay

మనం తీసుకునే ఆహారాలను ఎనర్జీగా మార్చేందుకు విటమిన్​ బీ ఉపయోగపడుతుంది. శరీరం ఎదుగుదలకు తోడ్పడుతుంది. మాంసం, ఫిష్​, గుడ్లలో విటమిన్​ బీని పొందొచ్చు.

Pixabay

విటమిన్​ సీ తో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. పండ్లు, ఆకు కూరలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది.

Pixabay

విటమిన్​ డీ తో ఎముకల బలం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యరశ్మితో పాటు గుడ్లు, పుట్టగొడుగు, పాలల్లో ఎక్కువగా లభిస్తుంది.

Pixabay

విటమిన్​ ఈతో రక్తం గడ్డకట్టే సమస్య దూరమవుతుంది. పొద్దుతిరుగుడు గింజలు, బాదం, పాలకూరల్లో విటమిన్​ ఈ అధికంగా ఉంటుంది.

Pixabay

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్​ కే తీసుకోవాల్సిందే! మాంసం, బ్రోకలీ, బ్లూబెర్రీలు, గుడ్లలో విటమిన్​ కే ఎక్కువగా పొందొచ్చు.

Pixabay

విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్​, జింక్​ వంటి మినరల్స్​ని కూడా డైట్​లో పెట్టుకుంటే.. ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం!

Pixabay

చర్మానికి మేలు చేసే కొలాజెన్‍ను పెంచగల 5 వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels