చిల్లీ ఫ్లేక్స్ తినడం వల్ల ఆ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు

By Haritha Chappa
May 11, 2024

Hindustan Times
Telugu

చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే ఎండు మిర్చిని బరకగా మిక్సీలో రుబ్బుకుని ఒక సీసాలో వేసుకోవాలి.

మగవారు చిల్లీ ఫ్లేక్స్ తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.

చిల్లీ ఫ్లేక్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

చిల్లీ ఫ్లేక్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల బరువు సులువుగా తగ్గుతారు. 

చిల్లీ ఫ్లేక్స్ ను మితంగా తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్, పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి.

వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం అధికంగా ఉంటాయి. 

బ్రేక్స్ ఫాస్ట్ లో తినే ఆమ్లెట్ పై చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుని తింటే ఎంతో మంచిది. గుండెకు మేలు చేస్తుంది. 

రోగనరోధక శక్తిని పెంచడంలో ఈ చిల్లీ ఫ్లేక్స్ ముందుంటాయి.