ప్లేట్లెట్ల సంఖ్య అధికమయ్యేందుకు ఈ 5 రకాల పండ్లు తినండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 16, 2024
Hindustan Times Telugu
రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య ఉండాల్సిన దాని కంటే తగ్గితే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లేట్లెట్లు వృద్ధి చెందేందుకు ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్యను పెంచగలిగే ఐదు రకాల ముఖ్యమైన పండ్లు ఏవంటే..
Photo: Pexels
బొప్పాయిలో ఎంజైమ్‍లు, పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తిని ఈ పండు వేగవంతం చేయగలదు. ఈ పండులో ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ కూడా మెండుగా ఉంటాయి.
Photo: Pexels
దానిమ్మ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపచటంతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్‍ను పెంచుతుంది. విటమిన్, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
Photo: Pexels
నారింజ పండ్లలో విటమిన్ సీ, ఫోలెట్ మెండుగా ఉంటాయి. ప్లేట్లెట్ల ఉత్పత్తికి ఇవి తోడ్పడతాయి.
Photo: Pexels
కివీ పండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను ఈ పండ్లు పెంచగలవు.
Photo: Pexels
స్ట్రాబెర్రీల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సీ.. ప్లేట్లెట్ల సంఖ్యను పెంచగలవు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాల వల్ల ఆరోగ్యానికి మేలు జరగుతుంది.
Photo: Pexels
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..