మొలకెత్తిన గోధుమలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజలు మంచి పోషణను అందిస్తాయి.
Unsplash
By Anand Sai Jun 18, 2024
Hindustan Times Telugu
మొలకలు అనేక తీవ్రమైన వ్యాధులను నివారించే దివ్యౌషధంలా పనిచేస్తాయి. అందులో మొలకెత్తిన గోధుమలు ఒకటి.. వీటితో కలిగే ప్రయోజనాలు చూద్దాం..
Unsplash
మొలకెత్తిన గోధుమలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి, సి, ఇ ఉంటాయి.
Unsplash
మొలకెత్తిన గోధుమలు మీ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మెటబాలిజం పెరుగుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది.
Unsplash
వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మన శరీరం బాగా పని చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
Unsplash
మధుమేహ వ్యాధిగ్రస్తులకు, మొలకెత్తిన గోధుమలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మొలకెత్తిన గోధుమలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లభిస్తాయి.
Unsplash
మొలకెత్తిన గోధుమలను తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం ఎక్కువ శాతం ఉంటుంది. ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది.
Unsplash
మొలకెత్తిన గోధుమలు అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Unsplash
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.