ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే నానబెట్టిన పెసరపప్పు తినండి

By Haritha Chappa
Sep 11, 2024

Hindustan Times
Telugu

 నానబెట్టిన పెసరపప్పు ప్రతిరోజూ ఒక గుప్పెడు తింటే చాలు మీరు ఊహించని ప్రయోజనాలు దక్కుతాయి.

అధికరక్తపోటుతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ నానబెట్టిన పెసరపప్పును తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

పెసరపప్పులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. ఇది శరీరంలో ఉన్న  మంటను, వాపును తగ్గిస్తాయి.

ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కావాలి. ఇవన్నీ పెసరపప్పులో ఉంటాయి. 

ఆర్ధరైటిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ నానబెట్టిన పెసరపప్పు తినాలి. 

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెసరపప్పులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

చర్మఆరోగ్యానికి పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ పప్పు అవసరం.

గుండె ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్  అవసరం. ఇవన్నీ కూడా పెసరపప్పులో ఉంటాయి. ఈ పప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash