పుదీనా ఆకులు ఆరోగ్యానికి అమృతం లాంటివి. ఇందులోని ప్రత్యేక గుణాలు వ్యాధులను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

By Anand Sai
Jun 25, 2024

Hindustan Times
Telugu

రోజూ పుదీనా ఆకులు తినడం వలన కొన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Unsplash

కేవలం వంటల్లో వేసుకోవడం మాత్రమే కాదు.. రోజూ కొన్ని ఆకులు తింటే మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు.

Unsplash

ఈ ఆకుల్లో విటమిన్ ఎ, సి, బి6 ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

రోజూ పుదీనా ఆకులను నమిలితే నోటి నుంచి దుర్వాసన రాదు. అలాగే నోటి ఆరోగ్యం బాగుంటుంది. చిగుళ్ళు, దంతాలలో ఎటువంటి సమస్య ఉండదు.

Unsplash

పుదీనాలోని ఔషధ గుణాలు శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్, అనేక ఇతర సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Unsplash

ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది అలెర్జీలు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల నుండి కూడా ఉపశమనం ఇస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని కూడా రక్షిస్తాయి.

Unsplash

ఈ ఆకులను ప్రతిరోజూ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్య సమస్యలు లేకుంటే దాని వినియోగం ప్రారంభించవచ్చు.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels