క్యాబేజీని లైట్ తీసుకోవద్దు.. తింటే ఈ ముఖ్యమైన లాభాలు
Photo: Pexels
By Chatakonda Krishna Prakash May 06, 2024
Hindustan Times Telugu
క్యాబేజీని కొందరు ఎక్కువగా తినరు. దీన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. క్యాబేజీని రెగ్యులర్‌గా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. అలా.. క్యాబేజీ వల్ల ఆరోగ్యానికి కలిగే ముఖ్యమైన లాభాలు ఏవంటే..
Photo: Pexels
క్యాబేజీలో విటమిన్ సీ, కే సహా మరిన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Photo: Pexels
క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు ఇది మేలు చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఉన్న కారణంగా క్యాబేజీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మం మెరుపు పెరిగేందుకు సహకరిస్తుంది.
Photo: Pexels
క్యాబేజీలో బీటా కరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా క్యాబేజీ తింటే కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.
Photo: Pexels
క్యాబేజీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు డైట్‍లో క్యాబేజీని తీసుకుంటే వెయిల్ లాస్‍కు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
పితృ పక్షం సమయంలో పూర్వీకులను కలలో చూడటం శుభమా? అశుభమా?