ఈ పానీయాలు తాగితే కీళ్ల నొప్పులు తగ్గడం ఖాయం

pixabay

By Haritha Chappa
Jul 12, 2024

Hindustan Times
Telugu

కొందరినీ కీళ్ల నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. వారు ప్రతిరోజూ కొన్ని రకాల పానీయాలు తాగితే ఆ నొప్పులు అదుపులో ఉంటాయి. 

pixabay

గ్రీన్ టీ రోజుకోసారి తాగితే ఆర్ధరటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ టీలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. 

pixabay

కాఫీలో కూడా యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువ. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడం ముందుంటుంది. 

pixabay

 ప్రతి రోజూ ఖాళీ పొట్టతో ఉదయానే వేడినీటిలో నిమ్మరసం కలుపుకుని తాగండి. ఇది జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుంది.

pixabay

మటన్ పాయ సూప్ లేదా చికెన్ సూప్ వంటివి తాగితే మంచిది. వీటిలో ఉండే కొలాజెన్, గ్లూకోసమైన్ అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

pixabay

పైనాపిల్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్రోమలైన్ అనే ఎంజైమ్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. 

pixabay

శరీరంలో తగినంత నీరు ఉన్నట్టు చూసుకోండి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటికి తగ్గకుండా తాగండి.

pixabay

పండ్లతో స్మూతీలను తయారు చేసుకుని తాగితే కీళ్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.  

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels