రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 04, 2024

Hindustan Times
Telugu

నారింజ (ఆరెంజ్) పండ్లలో ముఖ్యమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుకే ఆరెంజ్ జ్యూస్‍ను రెగ్యులర్‌గా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు చేకూరుతాయి. ఈ జ్యూస్ వల్ల కలిగే 5 లాభాలను ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ఆరెంజ్ జ్యూస్‍లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులను కూడా తగ్గించగలదు. ఇన్‍ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే వానాకాలంలో ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం మంచిది. 

Photo: Pexels

నారింజ జ్యూస్‍లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాలను ర్యాడికల్ డ్యామేజ్ నుంచి ఇవి సంరక్షిస్తాయి. గుండె వ్యాధులు లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే రిస్క్‌ను నారింజ తగ్గించగలదు. 

Photo: Pexels

ఆరెంజ్ రసంలో ఫ్లేవోన్స్ అధికంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచగలవు. జ్ఞాపకశక్తిని కూడా ఎక్కువ చేయగలదు. 

Photo: Pexels

నారింజలోని విటమిన్ సీ శరీరంలో కొలేజెన్ ఉత్పత్తిని పెంచగలదు. చర్మ ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎముకలు, కండరాల దృఢత్వాన్ని కూడా మెరుగుపరచగలదు.

Photo: Pexels

ఆరెంజ్ జ్యూస్‍లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థకు ఇది మేలు చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు ఈ జ్యూస్ సహకరిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. 

Photo: Pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels