మెంతులు చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వివిధ రకాల పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటుంది.

Unsplash

By Anand Sai
Jun 17, 2024

Hindustan Times
Telugu

మెంతి గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Unsplash

మెంతులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే అనేక రకాల అనారోగ్యాలు నయమవుతాయి. ఇది అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

Unsplash

మెంతి నీరు ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది, అలాగే కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Unsplash

ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

Unsplash

మెంతులు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

Unsplash

పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది ఋతు తిమ్మిరి, ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

Unsplash

అలాగే మెంతులు నానబెట్టి.. గ్రైండ్ చేసి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels