చలికాలంలో రాత్రి పూట రెండు, మూడు లవంగాలను నీటిలో నానేసి ఉదయాన్నే పరగడపున అలాగే లేదా వేడి చేసి తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి
pexels
By Hari Prasad S Dec 03, 2024
Hindustan Times Telugu
లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది
pexels
లవంగాల్లోని యంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సంబంధ సమస్యలు దూరమవుతాయి
pexels
చలికాలంలో డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. లవంగాలు ఇన్సులిన్ పనితీరు మెరుగుపరచి చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి
pexels
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చలికాలంలో లవంగాల నీరు మంచి ఔషధంగా పని చేస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది
pexels
చలికాలంలో చర్మ పొడిబారడం సహజం. అయితే లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్ల వల్ల ఇవి నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది
pexels
లవంగాల్లోని యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల చలికాలంలో వచ్చే బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయొచ్చు
pexels
లవంగాలు నానబెట్టిన నీరు మంచిదే అయినా మరీ ఎక్కువగా తాగితే యాసిడ్ రీఫ్లక్స్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది
pexels
రైస్ వాటర్ చర్మం, జుట్టు కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. పోషకాలు అధికంగా ఉండే బియ్యం నీరుతో కలిగే 5 ప్రయోజనాలు తెలుసుకుందాం.